పాత నోట్లు మరో వారం పొడిగిస్తారా ..?

Posted [relativedate]

old notes valid for one week more decision to comeపాత రూ. 500, 1000 నోట్ల చెల్లుబాటును మరో వారం లేదా పదిరోజుల పాటు పొడిగించే యోచన లో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టోల్ ట్యాక్స్ రద్దును నెలాఖరు వరకు పొడిగించిన ప్రభుత్వం.. ఇతర అత్యవసర సేవలు, ప్రాథమిక అవసరాలకు పాత నోట్ల చెల్లుబాటును కూడా పొడిగించవచ్చని సమాచారం. గురువారం అర్ధరాత్రితో పాత నోట్ల చెల్లుబాటు గడువు ముగిసిపోతుంది. అయితే, ఇప్పటికి ఇంకా పూర్తిగా కొత్త నగదు అందుబాటులోకి రాకపోవడం తో పాత నోట్లను చెల్లుబాటయ్యేలా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం కనిపిస్తోందిఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.