పద్మారావు వర్సెస్ తలసాని !!

Posted February 10, 2017 (3 weeks ago)

padmarao vs talasaniతెలంగాణ కేబినెట్ లో మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్య దూరం పెరిగిందన్న వార్తలొస్తున్నాయి. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారట. ప్రస్తుతం టీఆర్ఎస్ హవా నడుస్తున్న తరుణంలో హైదరాబాద్ పై పట్టుకోసం జోరు పెంచారన్న వాదన వినిపిస్తోంది.

నిజానికి మంత్రి పద్మారావు… టీఆర్ఎస్ లో తలసాని కంటే సీనియర్. అయినప్పటికీ తలసాని మాత్రం పద్మారావును చాలాకాలంగా డామినేట్ చేస్తున్నారని టాక్. పార్టీ వ్యవహారాల్లో తన మాటే చెల్లుబాటు అయ్యేలా పావులు కదిపారని సమాచారం. తన అనుచరులకు, తాను చెప్పిన వారికే అనుకూలంగా వ్యవహారం నడిపించారని ప్రచారం జరుగుతోంది.

తలసాని వ్యవహారంతో పద్మారావు బాగా అసంతృప్తితో ఉన్నారట. పార్టీలో సీనియర్ అయిన తనను.. తలసాని డామినేట్ చేయడం ఆయనకు ఇబ్బందిగా మారింది. చివరకు ఈ విషయాన్ని ఆయన సీఎం కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మంత్రి కేటీఆర్ ఆయనకు నచ్చజెప్పారట. పద్ధతి మార్చుకోవాలని తలసానికి సూచించారట. అయితే స్వతహాగా మాటకారి అయిన తలసాని … కేటీఆర్ ను మాటల్లో పెట్టేసి హాట్ హాట్ వాతావరణాన్ని కూల్ గా మార్చేశారట. దీంతో కేటీఆర్ కూడా అసలు విషయం మరిచిపోయారట.

తలసాని .. కేటీఆర్ నే మాయ చేయడంతో పద్మారావు మరింత సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇక పార్టీలో తన మాటే చెల్లుబాటు అయ్యేలా హైదరాబాద్ కే చెందిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని తన దారిలోకి తెచ్చుకున్నారని టాక్. దీంతో తలసాని ఇప్పుడు ఏకాకి అయిపోయారన్న వాదన వినిపిస్తోంది. ఇక హైదరాబాద్ టీఆర్ఎస్ లో ఆయన ఆధిపత్యానికి గండి పడినట్టేనని చెబుతున్నారు. అయితే ఈ పరిణామాలకు తలసాని ఎలా రియాక్ట్ అవుతారో..!!

NO COMMENTS

LEAVE A REPLY