దినకరన్ కేసులో పళనిస్వామి బుక్కయ్యారా..?

 Posted April 30, 2017 (5 weeks ago) at 11:44

palanisamy booked in seshikala caseశశికళ లేని సమయంలో తమిళనాడులో చక్రం తిప్పి సీఎం అవ్వాలని కలలు కన్న దినకరన్ ఆశల్ని కేంద్రం కల్లలు చేసింది. ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో కటకటాల వెనుక ఉన్నాడు దినకరన్. అయితే ఈ కేసును అంత తేలిగ్గా వదిలే అవకాశం కనిపించడం లేదు. దినకరన్ వెనుక మన్నార్ గుడి మాఫియా హస్తం ఉందన్న అనుమానంతో.. ఢిల్లీ పోలీసులు చెన్నై వచ్చి మరీ విచారణ జరపడం సంచలనమే.

దినకరన్ కు తమిళ క్యాబినెట్ నుంచి ఎవరూ బహిరంగంగా సపోర్ట్ చేయడం లేదు. అటు ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో మంత్రులు కూడా డబ్బులు పంచారని ఐటీ దగ్గర ఆధారాలున్నాయి. కానీ ఇప్పుడు దినకరన్ కూడా క్యాబినెట్ పై గుర్రుగా ఉన్నారని, ఉద్దేశపూర్వకంగా ఎవరో ఒకర్ని ఇరికించవచ్చనే ప్రచారం జరుగుతోంది. దీంతో సీఎం పళనిస్వామి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

దినకరన్ కేసులో నెక్స్ట్ వికెట్ పళనిస్వామే అనే అనుమానాలు బలపడుతున్నాయి. అటు పన్నీర్ తో రాజీ కుదుర్చుకుందామనుకుంటున్నా.. పార్టీలో చిన్నమ్మ పట్ల విధేయత వ్యక్తమవుతోంది. దీంతో పళనిస్వామికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. మరోవైపు ఢిల్లీ పోలీసులు ఎక్కడ తమ ఇంటికి వస్తారేమో అన్న భయంతో మంత్రులంతా సొంత జిల్లాల బాట పట్టారు.

Post Your Coment
Loading...