పళనిస్వామి వెర్సెస్ పన్నీర్

Posted February 14, 2017 (2 weeks ago)

panneerselvam vs palani swamy
అన్నాడీఎంకే రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి.ఎప్పటినుంచో సీఎం పీఠం కోసం కాచుకు కూర్చున్న శశికళ దారులు మూసుకుపోయి ఆమె జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇక పన్నీర్ కి రాచబాట అనుకుంటే అనూహ్యంగా పళనిస్వామి రేసులోకి దూసుకొచ్చారు.శశికళ అండతో అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు.పార్టీ సీనియర్ నేత సెంగోట్టైయెన్ తో కలిసి గవర్నర్ విద్యాసాగరరావు కి తనని ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతించాల్సిందిగా విన్నవించుకున్నారు.తనకు 128 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పుకున్నారు.

అటు పన్నీర్ సెల్వం కూడా ఈరాత్రికి గవర్నర్ ని కలిసి తనకు శాసనసభలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు.అంతే కాకుండా విబేధాలు మరిచి కలిసి పనిచేద్దామని ఇన్నాళ్లు శశికళ క్యాంపు లో వున్న ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు.అయితే శశికళ గ్రిప్ నుంచి ఇప్పటికీ ఆ ఎమ్మెల్యేలు బయటపడి మాట్లాకపోవడం విచిత్రమే.

NO COMMENTS

LEAVE A REPLY