జగన్ మీద పవన్ ఒత్తిడి ..

Posted [relativedate]

pavan put pressuure on jagan
పెద్ద నోట్ల రద్దు అంశం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందన తర్వాత వైసీపీ అద్యక్షుడు జగన్ మీద ఒత్తిడి పెరిగింది.ఇన్నాళ్లు ప్రధాని మోడీ మీద గౌరవం ఉందంటూ చెప్పుకొచ్చిన పవన్ ఈసారి మాత్రం అయన సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు.పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నప్పుడు అందుకు అవసరమైన కసరత్తు కేంద్రం చేయలేదని పవన్ ఆరోపించారు.దీంతో జనంలో అశాంతి నెలకొందని పవన్ అన్నారు.రచయిత సాయి మాధవ్ కవితని ఉటంకిస్తూ అయన జనాభిప్రాయాన్ని చాటిచెప్పే ప్రయత్నం చేశారు.

మెతుకుమెతుకు కూడబెట్టి ముద్ద పోగేస్తే దొంగ కుదంటున్నారబ్బా నేనెట్టా బతికేది కన్నీటి బొట్టు బొట్టు దాపెట్టి ఏడుపు పోగేస్తే నా ఏడుపు చెల్లదంటున్నారబ్బా నేనెట్టా చచ్చేది ఈ కవితని ట్విట్టర్ లో పెట్టి పవన్ తొలిసారి హోదా గాక మరో రాజకీయ అంశం మీద మోడీకి వ్యతిరేకంగా మాట్లాడ్డం ఇదే తొలిసారి.
అయితే ఏపీ లో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న వైసీపీ అధినేత జగన్ ఇప్పటిదాకా ఈ అంశం మీద నేరుగా మాట్లాడకపోవడం చిత్రమే.ఆ పార్టీ నేతలు మాత్రం దీని వల్ల జనం పడే ఇబ్బందుల కన్నా చంద్రబాబు అండ్ కో కి విషయం ముందే తెలుసని చెప్పడానికి ప్రాధాన్యమిస్తున్నారు.ఈ పరిస్థితులకి తోడు ఇప్పుడు పవన్ కూడా మోడీ మీద గొంతెత్తడం తో జగన్ మీదా ఒత్తిడి వచ్చింది.తప్పని సరిగా ఈ అంశం మీద మాట్లాడాల్సిన పరిస్థితి జగన్ కి వచ్చిపడింది.