నాగబాబుకి సలహా ఇచ్చిన తమ్ముడు..!!

Posted February 1, 2017 (4 weeks ago)

pawan kalyan advice to nagababu you must read jonathan livingston seagull bookమెగా బ్రదర్ నాగబాబు వెండితెర  నటుడే కాకుండా ఆరెంజ్, స్టాలిన్ , త్రినేత్రుడు వంటి ఎన్నో హిట్ సినిమాలను అందించిన నిర్మాత కూడా. ప్రస్తుతం జబర్దస్త్  ప్రోగ్రాంకి జడ్జిగా వ్యవహరిస్తూ  బుల్లితెర ప్రేక్షకులను కూడా పలకరిస్తున్నాడు. అయితే ఇటీవల గుంటూరులో ఖైదీ నెం.150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజున పలు  వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. కాగా ఏపి స్పెషల్ స్టేటస్ కి మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ వెనకే తానుంటానని, ప్రత్యేకహోదాకి జై కొట్టి తాను చిరులా మరోసారి వివాదాస్పదం కాకుండా  చూసుకున్నాడు. సినిమాల విషయంలో  పవన్ కి మంచి మంచి సలహాలు ఇస్తూ ఉండే ఈ మెగా బ్రదర్ ఇటీవల ఓ మీడియాకిచ్చిన ఇంటర్ వ్యూలో పవన్… తనకు ఇచ్చిన సలహా గురించి వివరించాడు.  

పుస్తకాలను ఎక్కువగా చదివే తన తమ్ముడు పవన్..  ఆంగ్ల రచయిత రిచర్డ్ బాచ్ రచించిన ‘జొనాథన్ లివింగ్‌ స్టన్ సీగల్’ అనే పుస్తకాన్ని చదవాల్సిందిగా సూచించాడని నాగబాబు తెలిపాడు. ఆ పుస్తకం చదవటం వల్ల ప్రతికూల పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుందని పవన్  నాగబాబుకి వివరించాడట. అలాగే ప్రపంచంలో ప్రతి మనిషి తన గురించి తాను తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఆ పుస్తకంలో ఉన్నాయని చెప్పాడట. ఇక ఆ పుస్తకాన్ని పవన్ చదవటం వల్లే ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నా తట్టుకుని నిలబడగలుగుతున్నాడని చెప్పుకొచ్చాడు నాగబాబు. కాగా ఈ ఇంటర్ వ్యూ చూసిన పవన్ అభిమానులు, పుస్తకాభిమానులు ఆ బుక్ గురించి తెగ ఆరా తీసేస్తున్నారట.

NO COMMENTS

LEAVE A REPLY