అన్న రికార్డును బద్దలు కొట్టిన పవన్!!

Posted February 6, 2017 (4 weeks ago)

pawan kalyan katamarayudu teaser break the chiranjeevi khaidi n0o 150 teaser recordsపవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తన పవనిజంతో అభిమానులను మెస్మరైజ్ చేస్తూ ఎప్పటికప్పుడు రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన డాలి దర్శకత్వంలో నటిస్తున్న కాటమరాయుడు సినిమా ఉగాది కానుకగా అభిమానుల ముందుకు రానుంది.

కాగా  అభిమానులు ఎప్పటి నుంచో  ఎదురుచూస్తున్న కాటమరాయుడు టీజర్ ను శనివారం చిత్రబృదం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడు ఉన్నాడన్నది ముఖ్యం’ అంటూ  పవన్‌ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్, అలాగే ‘రాయుడా..’ అంటూ వస్తున్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉన్న  ఈ టీజర్ యూట్యూబ్ లో  చేస్తున్న హడావుడిని ఒక్కమాటలో చెప్పడం కూడా కష్టం.

అతి తక్కువ సమయంలో 1 మిలియన్ వ్యూస్ అందుకున్న టీజర్ గా కాటమరాయుడు కొత్త రికార్డు నమోదు చేసింది. ఇప్పటివరకూ ఈ రికార్డు మెగాస్టార్ రీ ఎంట్రీ  మూవీ ఖైదీ నంబర్ 150 టీజర్ కి ఉంది. అయితే  మెగాస్టార్ కు 1 మిలియన్ వ్యూస్ మార్క్ ను టచ్ చేసేందుకు  3 గంటల 5 నిమిషాల సేపు పట్టగా పవర్ స్టార్  మాత్రం కేవలం రెండు  గంటల్లోనే  ఈ మార్క్ దాటేశాడు. టీజరే ఇంత సెన్సేషన్ ని క్రియేట్ చేస్తే ఇక సినిమా ఇంకెత సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందోనని అభిమానులు తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. మరి ఆ ఎగ్జైట్ మెంట్ తగ్గాలంటే ఉగాది వరకు ఆగాల్సిందే.

 

NO COMMENTS

LEAVE A REPLY