పవన్ పాద యాత్ర చేస్తాడట…

Posted November 11, 2016 (5 weeks ago)

pawan kalyan padayatra from anantapur
నిన్న అనంత లో బహిరంగ సభ విజయ వంతమైన తర్వాత పవన్ కళ్యాణ్ అనంత లోని పరిస్థితులు ,కరవు పై అధ్యయనం చేయాలి అనుకున్నాడట .దీంతో రాజకీయనాయకుల్లో కలకలం మొదలైంది ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాడు ఇప్పుడు పాదయాత్ర చేస్తే తమ పనైపోతుంది అనే కంగారు మొదలైంది.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ని అక్కడి గుత్తి ఇంజనీరింగ్ కళాశాలలోని బాలికలు యేవో ప్రశ్నలు వేసారట, మూడురోజులు పాదయాత్ర చేసిన తర్వాత వారి ప్రశ్నలకి సమాధానం చెప్తా అన్నాడట.అసలు ఈ కార్యక్రమం ఎప్పుడో చేయాల్సి ఉందట కానీ కాలం కలిసిరాక చేయలేకపోయా ఇదే పాద యాత్రకు సరైన సమయం అని అభిమానులతో పవన్ చెప్పినట్టు తెలిసింది . జగన్ పాదయాత్ర సన్నాహాల్లో ఉండగానే పవన్ ప్రకటన బయటకు రావటాన్ని ycp ఎలా తీసుకుంటుందో చూడాలి. దీని వెనుక కూడా బాబు ఉన్నాడన్న విమర్శలు చేసే అవకాశాలు లేకపోలేదు.

NO COMMENTS

LEAVE A REPLY