వైరాగ్యంతోనే సినిమాల్లోకి వచ్చా: పవన్ కళ్యాణ్

Posted February 11, 2017 (3 weeks ago)

Pawan Kalyan said about movies and politics at Harvard Universityపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హర్వర్డ్ యూనివర్సిటీలో ఇండియా కాన్ఫరెన్స్ 2017లో పాల్గొనేందుకు యూఎస్ లో  పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా హ్యామ్ప్ షైర్ లోని నషువా నగరంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన రాజకీయాల గురించి మాట్లాడడంతో పాటు సినిమాల పట్ల  తనకున్న అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. ఆయన తన  అభిమానులకు తెలియని ఎన్నో విషయాలను ప్రస్తావించారు. అసలు సినిమాలెందుకు చేస్తున్నదీ, ఎప్పటిదాకా చేసేదీ కూడా తెలిపారు.

తాను కేవలం ఏడు సినిమాల్లో నటించి వెళ్లిపోదామనుకున్నానని కానీ కుదరలేదని తెలిపారు. ఒకవేళ జానీ సినిమా హిట్టై ఉంటే వెళ్లిపోయే వాడినన్నారు. తన వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఉండేవని, దాంతో వైరాగ్యానికి గురయ్యానని, అందుకే సినిమాలు చేశానని తెలిపారు. అయితే  ఇంకెన్నాళ్లు సినిమాలు చేస్తానో చెప్పలేనన్నారు. ఒకవేళ భాద్యతలు ఎక్కువైనప్పుడు సినిమాలు ఆలస్యం అవుతాయని, అంతేకానీ సినిమాలకు మాత్రం దూరంగా ఉండడని స్పష్టంచేశారు. సినిమా వలన వచ్చిన ఇమేజ్ ను ఇలా ప్రజా సమస్యలపై పోరాటం కోసం వాడుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు.

 

NO COMMENTS

LEAVE A REPLY