అనంత నుంచే అరంగేట్రం …

Posted November 10, 2016 (5 weeks ago)

pawan kalyan said first janasena party office open in ananthapuram

  • జనసేన మొదటి పార్టీ కార్యాలయం అనంతలోనే-జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ మొదటి కార్యాలయాన్ని అనంతపురంలో ప్రారంభిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అనంతపురం లో గురువారం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.ఇటీవల దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు సంతాపం ప్రకటించిన అనంతరం జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ . రాష్ట్రన్ని పార్లమెంట్ తలుపులు మూసి,పెప్పర్ కొట్టి విభజించారన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని ప్రకటించాలని డిమాండ్ చేసారు. కేంద్ర మంత్రులు వెంకయ్య తదితరులు చెబుతున్నట్టు రాష్ట్రనికి కొత్తగా ఇచ్చిందేమి లేదని వాటా ప్రకారం ఇచ్చేదే ఇచ్చారని కొత్తగా చేసిందేమి లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ ను అర్ధరాత్రి ప్రకటించాల్సిన అవసరం ఏముందని, నిపుణులతో చర్చిన తర్వాత ప్యాకేజ్ ప్రకటిచాలిసిందని ప్రశ్నించారు .అనంతపురం సమగ్ర అభివృద్ధి సంస్థ తో కలిసి పనిచేస్తా నని సభాముఖంగా ప్రకటించారు. ఎన్నికల సమయంలో టీడీపీ తరపున ప్రచారం చేసినన్ని ఆ బాద్యతతోనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సలహాలు ఇస్తానని అంటూనే ఉత్తరాంధ్ర పై ద్రుష్టి పెట్టి సమస్యలు తీర్చాలని లేకుంటే ఉద్యమాలు వస్తాయని అన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY