తువాలు గుట్టు విప్పిన పవన్..

Posted February 11, 2017 (3 weeks ago)

pawan kalyan said secret of the red towel in americaగబ్బర్ సింగ్ ..దారితప్పిన పవన్ సినీ కెరీర్ ని మళ్లీ గాడిలో పెట్టిన సినిమా.ఆ సినిమాలో పవన్ వేసింది పోలీస్ పాత్ర అయినా మెడపై ఆయన చుట్టుకున్న ఎర్ర తువాలు అందరికీ గుర్తు వుండే ఉంటుంది.ఆ తువాలు స్టైల్ కోసం వేశాడని చాలా మంది భావించారు.కొంతమంది పవన్ స్టైల్ అంటూ ఆ సినిమా తర్వాత ఎర్ర తువాలు వేయడం ఫాషన్ గా భావించారు.అయితే ఆ తువాలు రహస్యాన్ని అమెరికాలో విప్పారు పవన్ కళ్యాణ్.అక్కడ జరిగిన ఓ సమావేశంలో గబ్బర్ సింగ్ లో తాను వేసుకున్న ఎర్ర తువాలు ఫాషన్ కోసం కాదని …అది భారత దేశంలో ప్రతి సామాన్యుడు,కర్షకుడు,కార్మికుడు వేసుకుంటారని ..వారి గుర్తుగానే ఓ సింబాలిక్ గా ఎర్ర తువాలు వాడినట్టు పవన్ చెప్పుకొచ్చారు.

జనసేన పార్టీ ఏర్పాటు తర్వాత ఈ తువాళ్ళకి పవన్ ఫాన్స్ లో క్రేజ్ పెరిగింది.ఇప్పుడు కాటమరాయుడు సినిమాలో కూడా కండువా వాడుతున్నట్టు పవన్ చెప్పారు.కాకపోతే ఈసారి రంగు మారుతోందట.వేసేది రైతు వేషం కాబట్టి ఈసారి ఆకుపచ్చ కండువా కాటమరాయుడులో వాడుతున్నట్టు కూడా పవన్ చెప్పేసారు.

 

NO COMMENTS

LEAVE A REPLY