సింగపూర్ సౌధాలు వద్దు ..సింగపూర్ రాజకీయం చేయండి

Posted November 10, 2016 (5 weeks ago)

pawan kalyan said we dont have singapur city building we have a singapur political rulingరాష్ట్రాన్ని సింగపూర్ గా  మార్చాలంటే పెద్ద పెద్ద బిల్డింగ్ లు ,రోడ్స్ నిర్మించటం కాదని అక్కడి రాజకీయం నేర్చుకొని అభివృద్ధి చేయాలనీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్ర ఫ్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి కి చురకలు వేశారు .సింగపూర్ మంత్రి స్నేహితుడు ఒకరు తప్పు చేస్తే ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా నిర్మొహమాటంగా వ్యవహరించి శిక్ష వేశారని ఉదహరించారు. చంద్రబాబు నాయుడు కూడా అదే తరహాలో వ్యవహరించాలని పరోక్షంగా సూచించారు, ప్రత్యేక హోదా విషయం లో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన ధోరణి కారణంగా  ప్రజలు నష్ట పోతున్నారని ప్రభుత్వం హోదా కోసం పోరాడాలని తాను కూడా ఈ పోరాటానికి మద్దతునిస్తా అని అన్నారు, అనంతపురానికి అవసరమైన 100 టీఎంసీ ల నీటి లభ్యతపై ప్రభుత్వం ద్రుష్టి సారించాలని నీటి వసతి లేకుండా ప్రాజెక్టులు ఎలా వస్తాయని ప్రశ్నించారు, అనంత పురం సమగ్ర అభివృద్ధి సంస్థ తో కలిసి పనిచేస్తానని జనసేన లక్ష్యం ప్రజాబి వృద్ధి అని అన్నారు,కుల మతాలకు అతీతంగా తాను సమస్యలపై పోరాడుతున్న అని ప్రభుత్వం ఈ సమస్యలపై ద్రుష్టి పెట్టాలని అన్నారు .

NO COMMENTS

LEAVE A REPLY