ఏలూరు మాటతో పవన్ కి తెలంగాణ సెగ ..

 Posted November 1, 2016

pawan kalyan said in eluru meeting write letter for telangana fans
కత్తికి రెండు వైపులా పదును..తిప్పగలిగే సామర్ధ్యం ఉంటే నాలుకకి ..రాయగలిగే శక్తి ఉంటే కలానికి అన్ని వైపులా పదునే …ఏలూరులో నివాసం,ఓటు గురించి నిర్ణయం తీసుకున్న పవన్ కి షాక్ ఇస్తూ …తెలంగాణాలో వున్న అయన అభిమానులకి హితబోధ చేస్తూ ఓ లేఖ సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది ….ఆ లేఖ మీకోసం …

ఇప్పటికయినా పవన్ కళ్యాణ్ లోని నటుడు బయటికి వచ్చి ఒక వ్యక్తిలా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. ఏలూరులో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం, అక్కడే ఓటుహక్కు నమోదు కోసం దరఖాస్తు చేయడం అతనిలోని వ్యూహాన్ని చెప్పకనే చెప్పింది. భవిష్యత్తులో ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకోవడానికి కావలసిన అస్త్ర శస్త్రాలను అక్కడినుండే సిద్ధం చేసుకోవడం ఆయనకు కలిసొచ్చే అంశమే.

ఇన్ని రోజులు తెలుగు వాడినంటూ నటుడిగా తన ఇమేజ్ కాపాడుకునే ప్రయత్నం చేసినా ఇప్పుడు తన భవిశ్యత్ రాజకీయ అవసరాల కోసం పరదా తొలగించక తప్పలేదు. 2013 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీకంటే కేవలం ఒక శాతం ఓట్లనే ఎక్కువ సాధించింది. చాలా చోట్ల అనేకమంది ప్రతిపక్ష సభుట్లు వెయ్యిలోపు ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కు మద్దతుగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు చాలా ప్రభావం చూపింది. అయితే రాజకీయంగా చంద్రబాబు నుండి ఆశించిన ప్రయోజనం రాకపోవడం జనం యొక్క ఆకాంక్షలను నెరవేర్చడంలో, ప్రభుత్వం మరొకవైపు ఈయన అభ్యర్థనలను పేద చెవిన పెట్టడంతో సీమాంధ్ర జెండా ఎత్తక తప్పని పరిస్థితి తలెత్తింది.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు కూడా చాలా తేలికగా తీసుకుంటున్నారు. ఉద్యమ సమయంలో విభజన కోరుతూ వందలమంది యువకులు తమ ప్రాణాలను అగ్నికి ఆహుతి ఇచ్చారు. అప్పుడు స్పందించని తమ అభిమాన నటుడు సీమాంధ్ర న్యాయం చేయాలని ఒక్కసారిగా గళం ఎత్తడంతో తెలంగాణ ప్రజలు నివ్వెర పోయారు. అభిమాన నటుడిని రాజకీయ కోణంలో చూడొద్దు అన్న దానిలో వాస్తవం ఎంత ఉందో నటులు కూడా ఒక ప్రాంతం ప్రజలనే ఆదరిస్తే తమ దారి తాము చూసుకోవలసిన అవసరం కూడా అంతే ఉంది. జరిగింది కూడా అదే..

ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తలమునకలయ్యి ఉన్నాడు . తన భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని ఖారారు చేసుకుంటున్నాడు. ఇప్పుడు తెలంగాణ లోని ఆయన అభిమానులు కూడా తమ భవిష్యత్ కార్యాచరణ మీద దృష్టి పెట్టాలి. పవనిజం పేరుతొ నిజం లేని సిద్దాంతాలను ఇజంగా ప్రచారం చేయడం మానుకుని బుద్దిగా తమ చదువుల మీద శ్రద్ధ పెట్టాలి. తమన్ నమ్ముకున్న తమ తల్లితండ్రుల ఆశలను నిజం చేసే దిశగా అడుగులు ముందుకు వెయ్యాలి. సీమాంధ్ర బిడ్డగా ఆయన అక్కడి ప్రజలకు న్యాయం చేయడానికి ఆయన తీసుకున్న నిర్ణంయం మీకు ఆదర్శం కావాలి. తెలంగాణ బిడ్డలుగా మీరు ఏమిచేయాలో మీకు వేరే చెప్పనక్కర లేదు. ఎందుకంటే మీలోని చైతన్యం తెలియంది కాదు….,
ఆల్ ది బెస్ట్ ఫర్ పవన్ కళ్యాణ్ మరియు ఆయన తెలంగాణ అభిమానులకు
… వాసుదేవ రావు

NO COMMENTS

LEAVE A REPLY