పదవి పోయినా సైలంట్ గా ఉన్న పీతల

Posted April 21, 2017 (3 days ago) at 11:02

peethala sujatha calm down after resigning the minister postఏపీ క్యాబినెట్ విస్తరణ సందర్భంగా ఎంత రగడ జరిదిందో అందరికీ తెలుసు. టీడీపీ లాంటి క్రమశిక్షణకు మారుపేరైన పార్టీలు ఇలాంటివి జరగడం విడ్డూరమే. కానీ అధినేత చాణక్యంతో సమస్యలన్నీ సద్దుమణిగాయి. అయితే ఎవరు ఎంత గోల చేసినా.. మాజీ మంత్రి పీతల మాత్రం పదవి పోయిన అసంతృప్తి లేకుండా.. కొత్త మంత్రుల ప్రమాణానికి హాజరైన.. పెద్దమనిషి తరహా ప్రవర్తనతో ఆకట్టుకున్నారు. ఆమెకు పదవి పోతుందని ముందే తెలుసు. ఆమెను ఎందుకు తప్పించాల్సి వచ్చిందో బాబుకు తెలుసు. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవడంతో పీతల కామైపోయారట.

పీతల సుజాత 2004లోనే ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2009లో పోటీకి అవకాశం దక్కలేదు. అప్పుడూ కామ్ గానే ఉన్నారు. 2014లో మళ్లీ ఎమ్మెల్యే కావడంతో.. బాబు మంత్రిని చేశారు. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ బలమైన సామాజిక వర్గం పీతల్ని టార్గెట్ చేసింది. ఎంపీ మాగంటి బాబుతో పాటు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆమె విషయంలో గుర్రుగా ఉన్నారు. తన నియోజకవర్గంలో వేలు పెట్టాలనుకున్న వీరి ఆటలు సాగకుండా పీతల ఎత్తులేయడంతో.. ఆమె వీరికి చేదైపోయారు.

అయితే చంద్రబాబు క్యాబినెట్ విస్తరణకు ముందే పీతలకు విషయం అర్థమయ్యేలా చెప్పడంతో ఆమె సైలంట్ అయ్యారట. తనను ఎవరెవరు బద్నాం చేశారో చంద్రబాబుకు పూసగుచ్చినట్లు వివరించారు పీతల. కానీ అన్నీ తనకు తెలుసని, అన్నిటికీ నేనున్నాని బాబు భరోసా ఇవ్వడంతో పీతల మనసు కాస్త కుదుటపడింది. అంటే పీతల మంత్రి పదవి తీసేసినా.. ఆమెపై చంద్రబాబుకు సానుభూతి మాత్రం అలాగే ఉందని ఆమె అనచురులు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు అన్నీ తెలుసు అంటే అర్థమేంటి.. పీతల చెప్పిన మాటలు నిజాలనా.. లేకపోతే ఆమె అసమర్థురాలనా అనే ప్రశ్నకు మాత్రం ఇప్పట్లో సమాధానం దొరకదు.

Post Your Coment
Loading...