పెళ్ళిచూపులకి ముస్తాబవుతున్న సల్మాన్ ..

pellichupulu remake salman khan

pellichupulu remake salman khanతెలుగు సినిమాల‌పై బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ మ‌న‌సు పారేసుకున్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఇదివ‌రకే పోకిరి, రెడీ,కిక్ లాంటి హిట్ చిత్రాల‌ను హిందీలో రీమేక్ చేసి స‌క్సెస్ సాధించిన ఈ భ‌జ‌రంగీ భాయిజాన్ క‌ళ్లు తాజాగా పెళ్లిచూపులు చిత్రంపై ప‌డ్డాయి. పెళ్లి చూపులు రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకోవ‌డంతో ఈ సిన్మాపై స‌ల్మాన్‌ఖాన్ ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందులో భాగంగానే సీనియ‌ర్ నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ బాబు స‌ల్మాన్ కోసం ఓ స్పెష‌ల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ లోబ‌డ్జెట్ మూవీలో స‌ల్మాన్ న‌టిస్తాడా లేదా అనేది మాత్రం స‌స్పెన్స్‌గానే ఉంది. ఒక‌వేళ న‌టించ‌కుంటే.. సినిమా హ‌క్కుల‌ను కొంటాడ‌నే టాక్ వినిపిస్తోంది.

NO COMMENTS

LEAVE A REPLY