రోజా నాగబాబుకి పోటీగా వారిద్దరు

Posted November 14, 2016 (4 weeks ago)

Posani Ramya Krishna Fight With Nagababu Rojaబుల్లితెరలో జబర్దస్త్ షో రేంజ్ ఏంటో అందరికి తెలిసిందే.. అడల్ట్ కంటెంట్ జోకులు ఎక్కువున్నా సరే స్మాల్ స్క్రీన్ పై సంచలనాలు సృష్టించిన షో అంటే అదే అని చెప్పాలి. అయితే ఓ ఛానెల్ లో ఓ షో సక్సెస్ అయితే అదే తరహాలో మరో ఛానెల్ లో ప్రయత్నాలు మొదలు పెట్టడం కామనే.. సినిమా కథలే కాపీ కొడుతుంటే మరి ఈ కాన్సెప్ట్ లు ఓ లెక్కా.. ఇప్పుడు జబర్దస్త్ కు పోటీగా లీడింగ్ ఛానెల్ ఒకటి మరో కామెడీ షో ఏర్పాటు చేస్తున్నారట.

రోజా, నాగబాబు రేంజ్ ఉన్న రమ్యకృష్ణ, పోసాని కృష్ణమురళిలను జడ్జ్ లుగా పెట్టనున్నారట. అయితే ఇదవరకు ఇలాంటి ప్రయత్నం జీ తెలుగు వారు చేసినా అంతగా సక్సెస్ కాలేదు. కాకపోతే ఈసారి ఈ పెద్ద ఛానెల్ వారు స్ట్రాంగ్ కంటెస్టంట్స్ తో వస్తున్నారట. ఇప్పటికే దీనికి సంబందించిన షూటింగ్ జరుగుతుందని టాక్.. త్వరలోనే ఆ షో స్మాల్ స్క్రీన్ పై రానున్నదట. మరి జబర్దస్త్ కు పోటీగా వస్తున్న ఈ కొత్త ప్రోగ్రాం దాని ముందు నిలబడగలుగుతుందా లేదా అన్నది చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY