ప్రభాస్‌ గురించి వచ్చిన ఆ వార్తలన్ని పుకార్లేనట!

Posted April 20, 2017 (4 days ago) at 18:14

prabhas sujeeth saho movie teaser rumor said vamsi
‘బాహుబలి 2’ సినిమా విడుదల అవ్వడమే ఆలస్యం వెంటనే సుజీత్‌ దర్శకత్వంలో ‘సాహో’ చిత్రాన్ని ప్రభాస్‌ చేయబోతున్న విషయం తెల్సిందే. సినిమా షూటింగ్‌ ప్రారంభంకు ముందే టీజర్‌ను లాంచ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ‘బాహుబలి 2’ విడుదలయ్యే ప్రతి థియేటర్‌లో కూడా ‘సాహో’ టీజర్‌ను ప్రదర్శించడం ద్వారా ఆ సినిమాకు భారీ పబ్లిసిటీ పొందాలని నిర్మాతలు భావించారు.

‘సాహో’ టీజర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లుగా వచ్చిన వార్తలు అన్ని కూడా పుకార్లే అని తేలిపోయింది. ప్రభాస్‌ సినిమాకు సంబంధించిన ఎలాంటి నిర్ణయం ఇంకా జరగలేదని, కనీసం టైటిల్‌ కూడా ఖరారు కాలేదు అంటూ నిర్మాతల్లో ఒక్కరైన వంశీ చెప్పుకొచ్చాడు. ‘బాహుబలి 2’ చిత్రం విడుదలైన తర్వాత తమ సినిమాను ప్రారంభిస్తామని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చివరి దశ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. ప్రభాస్‌కు భారీ క్రేజ్‌ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాను 150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ప్రభాస్‌ తర్వాత సినిమా కూడా విడుదల చేయనున్నారు.

Post Your Coment
Loading...