కరణ్‌కు మద్దతుగా ప్రభాస్‌పై బాలీవుడ్‌ జనాల ఆగ్రహం

 Posted May 8, 2017 (4 weeks ago) at 17:00

Prabhas to skip Karan Johar big Baahubali bash
‘బాహుబలి’ సినిమాకు ప్రస్తుతం ఇంత ప్రజాధరణ ఉంది అంటే అద్బుతంగా తెరకెక్కించిన రాజమౌళి, అద్బుతంగా నటించిన ప్రభాస్‌ మరియు ఇతర నటీనటులతో పాటు, మంచి ప్రమోషన్‌ చేసి, బిజినెస్‌ మెలకులు తెలిసిన కరణ్‌ జోహార్‌ కూడా కారణం అని ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిన విషయం. కరణ్‌ జోహార్‌ వల్లే బాలీవుడ్‌లో ఈ స్థాయి వసూళ్లు సాధ్యం అయ్యింది. మొదటి పార్ట్‌ను నమ్మకంతో తీసుకుని, అక్కడ భారీగా విడుదల చేశాడు. అందుకే చిత్ర యూనిట్‌ సభ్యులు మొత్తం కూడా కరణ్‌కు ఒకానొక సమయంలో కృతజ్ఞతలు చెప్పారు.

అలాంటి కరణ్‌ జోహార్‌ అడిగితే ప్రభాస్‌ కాదనడం చర్చనీయాంశం అయ్యింది. ‘బాహుబలి 2’ సినిమాను ముగించుకుని ప్రస్తుతం అమెరికాలో స్నేహితులతో హాలీడేస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న ప్రభాస్‌ను తాజాగా లండన్‌లో ‘బాహుబలి 2’ స్క్రీనింగ్‌కు కరణ్‌ జోహార్‌ ఆహ్వానించాడు. ఆ స్క్రీనింగ్‌ వల్ల మంచి ప్రమోషన్‌ సినిమాకు దక్కుతుందని కరణ్‌ భావించాడు. రెండు రోజులు హాలీడేస్‌ను పక్కకు పెట్టి లండన్‌ రావాల్సిందిగా ప్రభాస్‌ను కోరగ, తాను రాలేను అంటూ ఖరాకండిగా చెప్పించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై బాలీవుడ్‌లో హాట్‌ చర్చ జరుగుతుంది. కరణ్‌ జోహార్‌ పిలుపుకు ప్రభాస్‌ హాజరు అవ్వాల్సింది అంటూ బాలీవుడ్‌ జనాలు అంటున్నారు. మరి ప్రభాస్‌ ఏ పరిస్థితుల్లో ఉన్నాడో కూడా అర్థం చేసుకోవాలి అంటూ ఫ్యాన్స్‌ చెబుతున్నారు.

Post Your Coment
Loading...