భక్తి చిత్రంలో ప్రగ్యా అందాలు..!

Posted November 22, 2016

pragya jaiswal look in om namo venkateshayaకింగ్ నాగార్జున, కె. రాఘవేంద్ర రావు కాంబినేషన్లో వస్తున్న సినిమా ఓం నమో వెంకటేశాయ. హతిరాం బాబా బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాలో నాగార్జునతో పాటుగా హీరోయిన్స్ అనుష్క, ప్రగ్యా జైశ్వాల్, విమలా రామన్ నటిస్తున్నారు. ఇప్పటికే టైటిల్ పోస్టర్ తో పాటుగా నాగార్జున లుక్, సౌరబ్ జైన్ వెంకటేశ్వరని లుక్ రివీల్ చేసిన చిత్రయూనిట్ ఈ మధ్యనే లక్ష్మిగా అనుష్క లుక్ ను రివీల్ చేసింది.

ఇక సినిమాలో నటిస్తున్న హాట్ గాళ్ ప్రగ్యా జైశ్వాల్ ఏవిధంగా ఉంటుంది అని ఫ్యాన్స్ ఎదురుచూశారు. ఇప్పుడు ఓం నమో వెంకటేశాయలోని ప్రగ్యా జైశ్వాల్ లుక్ కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. పట్టు పరికిణిలో అమ్మడు బుట్టబొమ్మగా కనిపిస్తూనే కావాల్సిన స్కిన్ షో చేసేస్తుంది. భక్తి చిత్రంలో ప్రగ్యా అందాలు కూడా హైలెట్ అవ్వనున్నాయని ఈ మోషన్ పోస్టర్ తో చెప్పాడు.

షూటింగ్ కంప్లీట్ చేసుకున్న నమో వెంకటేశాయ ముందు సంక్రాంతికి రిలీజ్ అని హడావిడి చేసినా గ్రాఫిక్స్ వర్క్ అప్పటికల్లా పూర్తి కాదని తెలియడంతో ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. శిరిడి సాయి నిర్మాత మహేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY