ప్రకాష్ రాజ్ కొడుకు ప్రకాష్ రాజ్ నే మించిపోయాడుగా!

Posted February 4, 2017

prakash raj and his son poses to camera same to sameప్రకాష్ రాజ్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఏ క్యారక్టర్నైనా అలవోకగా చేసే విలక్షణ నటుడాయన.కాగా ఏడాది వయస్సున్న ఆయన కొడుకు వేదాంత్  అప్పుడే తండ్రినే మించిపోయాడు.

ప్రకాష్ రాజ్,  కొరియోగ్రాఫర్ పోనీ వర్మల కుమారుడైన వేదాంత్ రీసెంట్ గా  ఫస్ట్ బర్తడే జరుపుకున్నాడు. బర్త్ డే  సందర్భంగా.. తండ్రీ కొడుకులు ఇద్దరూ ఒకే రకమైన డ్రస్ లు వేసుకుని మాంచి హంగామా చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. వాటిలో ఒక సూపర్బ్ పిక్చర్ ను అభిమానులకు షేర్ చేసింది పోనీ వర్మ. ఇద్దరూ ఒకే యాంగిల్ లో కెమేరా వంక చూసి నవ్వుతూ ఉన్న ఈ ఫొటో అదిరిపోయింది కదండీ.  ఇక నెటిజన్లు ఈ ఫొటోని  తెగ షేర్లు కొట్టేస్తూ  లైక్ చేసేస్తున్నారు. ఏమైనా  కెమేరాకు ఫోజులు ఇవ్వడంలో వేదాంత్ అప్పుడే తండ్రిని మించిపోయినట్లున్నాడు అని కాంప్లిమెంట్ ఇవ్వక తప్పదేమో కదండీ.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY