ప్రకాష్ రాజ్ చెప్పిన మన ఊరి రామాయణం

 

  prakash raj told about mana oori ramayanam   

      జాతీయ ఉత్తమనటుడు   ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్నటువంటి  ద్విభాషా చిత్రం.  ‘మన ఊరి రామాయణం’ (తెలుగు)  ‘ఇదొల్లె రామాయణ’ (కన్నడ ).  ప్రకాష్ రాజ్, ప్రియమణి, సత్యదేవ్, పృథ్వి, రఘుబాబు ప్రధాన తారాగణం. చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మాణా నంతర  కార్యక్రమాలు జరుగుతున్నాయి.  ఈ నెలలో సెన్సార్ పూర్తి  చేసుకుని సెప్టెంబర్  మాసంలో విడుదలకు  మన ఊరి రామాయణం’  సిద్ధం  అవుతుంది, ఈ సినిమాని హైదరాబాదు షాద్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ మరియు కర్ణాటక కూర్గ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. జాతీయ అవార్డు గ్రహితులైనటువంటి ఇళయరాజా, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, కళా దర్శకుడు శశిధర్ ఆడప, వంటి కళా నిపుణులు ఈ చిత్రానికి వర్క్ చేసారు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విడుదల అయింది. 

ఈ చిత్రం గురించి చెప్పాలంటే దుబాయ్ రిటర్న్ ఐనటువంటి ఒక వ్యక్తి , సమాజంలో ఎంతో  గౌరవించబడే ఆ  వ్యక్తి  జీవితంలో శ్రీరామనవమి సమయంలో  లో జరిగినటువంటి ఒక సంఘటన తన జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పింది అనేది ప్రధానంశంగా తెరకెక్కింది, ప్రతి మనషి లో ఒక రాముడు ఒక  రావణుడు వుంటాడు. వారి గురించి చెప్పే చిత్రం ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది మనందరి  రామాయణం, మన ఊరి రామాయణం.  ‘ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్, ఫస్ట్ కాపీ పిక్చర్స్’ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. 

ఆర్టిస్ట్స్

 

ప్రకాష్‌ రాజ్‌

ప్రియమణి

సత్యదేవ్‌ (జ్యోతిలక్ష్మి ఫేమ్)

పృథ్వీ

రఘుబాబు

టెక్నిషియన్స్

 

కథ : జాయ్ మాథ్యూ

మాటలు : రమణ గోపిశెట్టి, ప్రకాష్ రాజ్

సాహిత్యం : భాస్కరభట్ల రవికుమార్

ఆర్ట్ : శశిధర్ అడప

ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్

సినిమాటోగ్రఫీ : ముకేశ్

సంగీతం : ఇళయరాజా

నిర్మాతలు : ప్రకాష్ రాజ్, రామ్ జీ

స్క్రీన్ ప్లే- దర్శకత్వం : ప్రకాష్ రాజ్ 

NO COMMENTS

LEAVE A REPLY