పురుషుడి పొట్టలో గర్భ సంచి ..

Posted December 3, 2016

article-2151463-1358b837000005dc-165_634x800హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఓ వ్యక్తికి వరిబీజం ఆపరేషన్ చేస్తుండగా… అతని పొట్టలో గర్భసంచి ఉన్న విషయాన్నీ గుర్తించారు వివరాల్లోకి వెళ్తే, యాదాద్రి జిల్లా మోత్కూరుకు చెందిన 37 ఏళ్ల ఓ వ్యక్తి వరిబీజం సమస్యతో గత నెల 23న గాంధీ ఆసుపత్రిలో చేరాడు. నిన్న అతనికి శస్త్రచికిత్సను ప్రారంభించారు.ఈ క్రమం లో గర్భ సంచి ఉన్న విషయాన్నీ తెలుసుకొన్న వైద్య సిబ్బంది ఈ విషయాన్ని మూత్ర సంబంధిత విభాగాధిపతి డాక్టర్ జగదీష్ దృష్టికి వారు తీసుకెళ్లారు. రోగిని పరీక్షించగా… ఆయన పొట్టలో మహిళలకు ఉండే అండాశయం, గర్భసంచిలు కనిపించాయి. పురుషులు వీటిని కలిగి ఉండటాన్ని ట్రూహెర్నాప్రోడీట్ గా పిలుస్తామని వైద్యులు తెలిపారు.త్వరలో మరో శస్త్ర చికిత్స నిర్వహించి తొలగిస్తామని చెప్పారు .

Post Your Coment
Loading...