ఆ నిర్మాతకు షాక్ ఇచ్చిన మహేష్

Posted December 15, 2016

Producer Change Mahesh Movieటాప్ హీరోల సినిమాలకు కాంబినేషన్ కుదరాలంటే అన్ని సెట్ అవ్వాలి. అయితే సినిమా ఫైనల్ అవడానికి ముందే ఆ కాంబినేషన్ మీద నెగటివ్ ప్రచారం జరిగితే మాత్రం హీరోలు మాత్రం ఆ గాసిప్పులను పక్కన పెట్టి సినిమా చేయడానికి సాహసించరు. ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లోనే మహేష్ బాబు పివిపితో సినిమా చేసేందుకు సుముఖంగా లేడని అంటున్నారు. ఈ కాంబినేషన్ లో వచ్చిన బ్రహ్మోత్సవం ఫ్లాప్ గా నిలవడంతో పివిపితో మరో సినిమా అంటే డైలమాలో పడ్డాడు మహేష్.

ఫ్యాన్స్ కూడా పివిపి సినిమాపై వ్యతిరేకత చూపడంతో పివిపితో సినిమా క్యాన్సిల్ చేసుకున్నట్టు టాక్. ఇక మహేష్ మాత్రం పివిపి నిర్మాణంలో చేయాలనుకున్న వంశీ సినిమా మాత్రం దిల్ రాజు ప్రొడక్షన్ లో చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాను అశ్వనిదత్ కూడా సహ నిర్మాతగా పనిచేస్తాడట. మొత్తానికి మహేష్ సినిమాకై ప్రయత్నించిన పివిపి చివరకు అలా షాక్ తిన్నాడని అంటున్నారు.

ప్రస్తుతం మురుగదాస్ సినిమా చేస్తున్న మహేష్ ఆ సినిమా పూర్తి చేశాక కొరటాల శివతో సినిమా చేయనున్నాడు. అది కూడా పూర్తయిన తర్వాత వంశీ పైడిపల్లి సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY