ప్రొఫెసర్ లక్ష్మిని పట్టుకొన్న ఏపీ పోలీస్

 

Posted November 14, 2016 (4 weeks ago)

profesor lakshmi in ap police custodyగుంటూరు వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య చేసుకొన్న తరువాత నుంచి అజ్ఞాతంలో ఉన్న ప్రొఫెసర్ లక్ష్మిని పోలీస్ లు బెంగళూరు లో పట్టుకొన్నారు .సంధ్యారాణి ఆత్మహత్య కేసులో లక్ష్మి నిందితురాలు. గతకొద్ది రోజులుగా ఎవరికీ దొరకకుండా అజ్ఞాతంలో ఉంది.ప్రొ. లక్ష్మిని అరెస్ట్ చేసిన పోలీసులను మంత్రి కామినేని శ్రీనివాస్, డీజీపీ అభినందించారు. సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి ఆమె పరారీలో ఉన్న సంగతి తెలిసిందే.

లక్ష్మి వేదింపులు తట్టుకోలేక సంధ్యారాణి అక్టోబర్‌ 22న ఆత్మహత్యకు యత్నించింది. దీంతో ఆమెను సహచర విద్యార్థులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతున్నఆమె పరిస్థితి విషమించడంతో 24న మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో భాగంగా పోలీసులకు సంధ్యారాణి డైరీ లభించింది. లక్ష్మి తనను తీవ్రంగా వేధిస్తోందని.. ఆమె వేధింపులు భరించలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ డైరీలో రాసుకొంది.

NO COMMENTS

LEAVE A REPLY