సంపూ కోసం కలం పట్టిన పూరి..!

Posted April 26, 2017 (5 weeks ago) at 16:54

puri jagannadh to do movie with sampoornesh babu
‘హృదయ కాలేయం’ చిత్రంతో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సంపూర్నేష్‌బాబు ప్రస్తుతం ‘కొబ్బరిమట్ట’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు ‘వైరస్‌’ అనే చిత్రాన్ని కూడా సంపూ చేస్తున్నాడు. ఇటీవల ‘కొబ్బరిమట్ట’ ఒక పాటను పూరి జగన్నాధ్‌తో విడుదల చేయించారు. ఆ సమయంలోనే సంపూ సత్తాను చూసిన పూరి ఒక సినిమా చేస్తానంటూ హామీ ఇచ్చాడు. సంపూకు తగ్గ ఒక మంచి కామెడీ స్టోరీని సిద్దం చేస్తానంటూ అప్పుడే హామీ ఇచ్చాడు.

ప్రస్తుతం బాలకృష్ణతో సినిమా చేస్తున్న పూరి జగన్నాధ్‌ ఖాళీ దొరికితే సంపూ కోసం స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నాడట. బాలయ్య సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం అక్టోబర్‌లో తను మాటిచ్చిన ప్రకారం సంపూతో రెండు లేదా మూడు నెలల్లోనే సినిమాను పూర్తి చేసి ఇదే సంవత్సరంలో విడుదల చేయాలని పూరి భావిస్తున్నాడు. స్టార్‌ హీరోల నుండి కమెడియన్స్‌ వరకు అందరితో సినిమాలు చేస్తూ విభిన్న దర్శకుడిగా పేరున్న పూరి తన తర్వాత సినిమాను సంపూతో చేయబోతుండటం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది. ఇందుకే పూరిని డాషిండ్‌ డైరెక్టర్‌ అంటారని ఆయన అభిమానులు అంటున్నారు.

Post Your Coment
Loading...