టాలీవుడ్ కి టాటా చెప్పున్న పూరీ?

Posted February 14, 2017 (2 weeks ago)

puri jagannath good bye to tollywoodపూరీ జగన్నాధ్.. ఒకప్పుడు ఈయన దర్శకత్వంలో సినిమా వచ్చిందంటే చాలు… అభిమానులు ధియేటర్లకి క్యూ కట్టేవారు. మరి ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఈయన దర్శకత్వానికి  క్రేజ్ ఉన్నా, ఆ క్రేజ్ ఆడియన్స్ ని ధియేటర్లకు రప్పించలేకపోతోంది. దీంతో ఆయన వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నాడు. ఒకప్పుడు ఆయన ఇంటి ముందు క్యూ కట్టిన పెద్ద హీరోలే ఇప్పుడు డేట్స్ ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నారు. దీంతో పూరీ టాలీవుడ్ కి టాటా చెప్పెయ్యడానికి నిర్ణయించుకున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

కన్నడ సినిమా పరిశ్రమలో ఆయనకు ఓ భారీ డీల్ రావడం కూడా ఓ కారణంగా చెప్పుకుంటున్నారు. కన్నడ నిర్మాత సీఆర్ మనోహర్ తో పూరీ  మూడు చిత్రాలు చేయడానికి ఒప్పందం చేసుకున్నాడట. ఈ ఒప్పందంలో భాగంగానే నిర్మాత తనయుడు ఇషాన్ ని పరిచయం చేస్తూ రోగ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట పూరీ. మరో రెండు సినిమాలు కూడా ఇషాన్ తో చేయాల్సివుంది. దీంతో  పూరి  టాలీవుడ్ కి గుడ్ బై చెప్పనున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి టాలీవుడ్ లో తన మార్క్ సినిమాలను చూపించిన పూరీ శాండిల్ వుడ్ కి సెట్ అవుతాడో లేదో చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY