ఇంకా రెండు మూడు రోజులు వానలు…

  raining two more days ap telangana

ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాలను ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఎడతెరఫి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో ఆయా ప్రాజెక్టులులకు జలకళ వచ్చింది. భారీ వర్షాలకు పలు గ్రామాలు, పట్టణాలు జలమయంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  మరో రెండు, మూడు రోజుల పాటు ఇరు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY