రాజ్ తరుణ్ దొంగ పెళ్లి చేసుకున్నాడా?

Posted September 23, 2016

 raj tarun get married anchor lasya
    టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఓ టీవీ యాంకర్ ని రహస్య వివాహం చేసుకున్నట్టు ఫిలిం నగర్ లో ప్రచారం జరుగుతోంది.ఏ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా చిత్ర సీమలో తనదైన ప్రత్యేకత సాధించిన హీరో రాజ్ తరుణ్.అమాయకంగా కనిపించే టీవీ యాంకర్ ప్రేమలో పడిన విషయం ఎవరికీ తెలియదు.ఆ యాంకర్ సాటి యాంకర్ తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చినా ఆ ఇద్దరు దాన్ని కొట్టిపారేశారు.తాము కేవలం స్నేహితులమని చెప్పి ఆ పుకార్లకు తెరదింపారు.

ఈ వ్యవహారంతో హర్ట్ అయిన ఆమె కుటుంబ సభ్యులు యాంకరింగ్ ఆపించి ఇంట్లోనే ఉండేలా కట్టడి చేసారంట.అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆమెని రాజ్ తరుణ్ ప్రేమ వివాహం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.యాంకర్ తరపు పెద్దలు ఒప్పుకోకపోవడం వల్లే వాళ్ళు దొంగ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని హీరో ఫ్రెండ్స్ చెప్తున్నట్టు తెలుస్తోంది.ఇందులో నిజానిజాలేమిటో మరో రెండుమూడు రోజుల్లో తేలిపోతుంది.

Post Your Coment
Loading...