రాజ్ తరుణ్.. అందగాడు !

 Posted October 28, 2016

raj tarun veligonda srinivas new movie andagaduటాలీవుడ్ లో రచయితలు దర్శకులుగా మారే ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అంతా ముందు కలంతో పేరుతో తెచ్చుకొని.. ఆ తర్వాత మెగా ఫోన్ పట్టినవారే.ఈ లిస్టులో త్రివిక్రమ్, కొరటాల..వంటి వారు కూడా ఉన్నారు.తాజాగా,మరో టాలీవుడ్ రచయిత మెగా ఫోన్ పట్టుకునేందుకు రెడీ అయ్యాడు.

వెలిగొండ శ్రీనివాస్.. పండగ చేస్కో, బాడీగార్డ్ లాంటి పలు కమర్షియల్ సినిమాలకు రచయితగా పనిచేశాడు.ఇపుడీయన యంగ్ హీరో రాజ్ తరుణ్ ని డైరెక్ట్  చేయనున్నాడు. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ గుడ్డివాడిగా కనిపించబోతున్నాడట. శ్రీనివాస్ చెప్పిన కథ రాజ్ తరుణ్ కి విపరీతంగా నచ్చడంతో వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్తున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. ఈ చిత్రానికి ‘అందగాడు’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.

ప్రస్తుతం వంశీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రాజుగాడు’ సినిమాతో బిజీగా ఉన్నాడు రాజ్ తరుణ్.ఈ సినిమా తర్వాత ‘అందగాడు’ని సెట్స్ పైకి  తీసుకెళ్లనున్నాడు.

Post Your Coment
Loading...