మాహిష్మతిపై మనసు పారేసుకున్న చంద్రబాబు

Posted December 18, 2016

rajamouli architech of amaravathiఏపీ సీఎం చంద్రబాబు అమరావతిని దేశంలోనే బెస్ట్ రాజధానిగా మలచాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పలు దేశాలను ఆయన సందర్శించారు. చాలా డిజైన్లను పరిశీలించారు. కానీ ఆయనకు అవేవీ నచ్చలేదట. చంద్రబాబు ఆలోచనలకు ఒక్క డిజైన్ కూడా మ్యాచ్ కాలేదని చెబుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో అనుకోకుండా బాబుగారి ముందు బాహుబలి గురించి చర్చ వచ్చిందట. ఒక్కసారి ఆ మాహిష్మతి డిజైన్ ను కూడా చూడాలని మంత్రులు సలహా ఇచ్చారని సమాచారం. కొంచెం అయిష్టంగానే దాన్ని కూడా చూశారట ఏపీ సీఎం.మాహిష్మతిని చూసిన అనంతరం అది కూడా నచ్చలేదని చంద్రబాబు చెప్తారేమోనని అనుకున్నారట మంత్రులు.కానీ బాబు మాత్రం ఫుల్ ఖుష్ అయిపోయారట. మాహిష్మతి రేంజ్ లో అమరావతి ఉండాలని చర్చ జరిగిందని చెబుతున్నారు. అంతే రాజమౌళికి ఫోనో వెళ్లిందట. తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారట.

బాహుబలి-2 బిజీలో ఉన్న రాజమౌళి ఈ సినిమా షూటింగ్ తర్వాత సమయం ఇస్తానని ఏపీ ప్రభుత్వాలతో చెప్పారని ప్రచారం జరుగుతోంది. అయినా ఫరవాలేదు.. టైమ్ తీసుకొని అమరావతికి డిజైన్ చేయాలని జక్కన్నకు ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. ఆ కమిట్ మెంట్ లో భాగంగానే రాజమౌళి .. అమరావతి రంగంలోకి దిగబోతున్నారని టాక్.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY