ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జక్కన్న ఎమోషన్

 Posted March 27, 2017 (5 weeks ago)

Rajamouli gets emotional in Baahubali 2 Pre Release eventబాహుబలి-2 రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్రయూనిట్ నిన్న సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, బాలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, రెబల్ స్టార్ కృష్ణంరాజు, రాజమౌళి  తల్లిదండ్రులు, రమ్యకృష్ణ, ఆర్కా మీడియా ప్రొడ్యూసర్స్ … వంటి అతిరధమహారధుల సమక్షంలో  ఈ వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది.

ఈ వేడుక సందర్భంగా కీరవాణి..  జక్కన్న గొప్పదనాన్ని ఓ పాట రూపంలో పాడి వినిపించారు. దీంతో రాజమౌళి కాస్త ఎమోషన్ అయ్యారు. ఆ తర్వాత అనర్గళంగా మాట్లాడిన రాజమౌళి… తాను కమర్షియల్ సినిమాలు చేస్తూ,  ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు హీరోయిజం ఎలా ఉండాలో  ఊహించుకుంటూ అలాగే సినిమాలు చేసేవాడినని తెలిపాడు. బాహుబలి సినిమాకు  సహకరించిన ప్రతీ ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు చెప్పాడు. ప్రత్యేకంగా తనకోసం ఇన్నేళ్ల సమయాన్ని కేటాయించిన  ప్రభాస్ కు తాను ఏం ఇచ్చాను అని ఆలోచించేవాడినన్నారు. బాంబేలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ప్రభాస్ ఎంట్రీతో మీడియా ప్రతినిధులే పెద్దగా అరిచారని, ప్రభాస్ కి ఆ క్రెడిట్ ఇప్పించగలిగానని, ఆ సాటిస్ఫ్యాక్షన్  చాలనిపించిందన్నారు. బాహుబలిలో ఎన్నో అద్భుతాలు చేశాం కానీ, ప్రభాస్ మాత్రం స్పెషల్స్ లో స్పెషల్ అని కొనయాడాడు.


Post Your Coment
Loading...