హీరోగా రాజమౌళి కొడుకు?

Posted [relativedate]

rajamouli son kartikeya as hero in new movie
దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ తండ్రిలా కాకుండా వెండితెర మీద మెరిసిపోవాలనుకుంటున్నాడట.తండ్రి దగ్గర సహాయ దర్శకుడిగా,పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేసిన కార్తికేయ కొన్ని బయట సినిమాల కోసం కూడా సేవలు అందించాడు.అయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా సినిమా అంటూ ఇటీవల సోషల్ మీడియా లో పుకార్లు కూడా వచ్చాయి.

రాజమౌళి కుటుంబమంతా సినిమాల్లోనే పని చేస్తున్నా అందరూ తెర వెనుక వ్యవహారాలకు పరిమితమయ్యారు.కానీ ఒక్కరు కూడా హీరో కావాలన్న ఆలోచన చేయలేదు.హీరోలకి దీటుగా కనిపించే ,నటించే రాజమౌళి కూడా ఆ విషయం మీద ఎన్నడూ దృష్టి పెట్టలేదు.కార్తికేయ మాత్రం ఆ దిశగా దృష్టి పెట్టి …అందుకు అవసరమైన శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.అతని ఆకాంక్షకు కుటుంబ మద్దతు కూడా దొరికిందట.అయితే అతన్ని వెండితెరకి రాజమౌళి పరిచయం చేస్తాడా లేక వేరే దర్శకుడి చేతిలో పెడతారా అనేది తెలియాల్సి వుంది.