వారు చేస్తున్నది అతి నీచమైన పని

Posted April 20, 2017 (6 days ago) at 19:05

rajamouli tweet in twitter request to kannada people for bahubali 2 movie release
దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘బాహుబలి 2’ చిత్రాన్ని కన్నడ రాష్ట్రంలో విడుదల కానిచ్చేది లేదు అంటూ ఆందోళనకారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు పలు విజ్ఞప్తులు చేస్తున్నారు. తాజాగా రాజమౌళి ట్విట్టర్‌ ద్వారా కన్నడంలో కన్నడ ప్రజలను మరియు ఆందోళన కారులను దయచేసి తమ సినిమాను విడుదల కానివ్వాలని కోరడం జరిగింది. సత్యరాజ్‌ కారణంగా బాహుబలి సినిమాను అడ్డుకోవడం చాలా దారుణం అని సినీ విశ్లేషకులు అంటున్నారు.

సినిమాలో ఒక పాత్ర పోషించిన వ్యక్తి కారణంగా, అతడు ఎప్పుడో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు పరిగణలోకి తీసుకుని సినిమాను విడుదల కానివ్వం అంటూ వారు చేస్తున్న ఆందోళన అర్థ రహితం అని, సత్యరాజ్‌ 9 సంవత్సరాల క్రితం వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత ఆయన నటించిన, నిర్మించిన సినిమాలు కన్నడంలో విడుదల అయ్యాయి. అప్పుడు కలుగని నొప్పి ఇప్పుడెందుకు అంటూ బాహుబలి మద్దతుదారులు చెబుతున్నారు. కన్నడంలో బాహుబలిని అడ్డుకోవడం చాలా నీచమైన పని అని, పబ్లిసిటీ కోసం కొందరు ఆడుతున్న నాటకం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో 8 రోజుల్లో విడుదల కాన్ను బాహుబలికి అప్పటి వరకు సమస్యలు అన్ని తీరుతాయని ఆశిద్దాం.

Post Your Coment
Loading...