గరుడవేగ ఫస్ట్ లుక్ రిలీజ్..

Posted February 3, 2017 (4 weeks ago)

rajasekhar new movie psv garudavega 126.18m first lookఒకప్పుడు పోలీస్ క్యారెక్టర్ల కు పెట్టింది పేరుగా ఉన్న డాక్టర్‌ రాజశేఖర్‌ గత కొంతకాలంగా సరైన హిట్ లేకపోవడంతో సైలెంట్ అయిపోయాడు. కాగా మరోసారి తన లక్ ని పరీక్షించుకునేందుకు తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కధనే సెలెక్ట్ చేసుకున్నాడు ఈ యాంగ్రీ యంగ్ మెన్.  

పి.ఎస్‌.వి.గ‌రుడ వేగ 126.18ఎం’ పేరుతో తెరకెక్కనున్న  ఈ సినిమాకు విలక్షణ దర్శకుడు ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  కాగా, ఫిబ్రవరి 4న రాజశేఖర్‌ బర్త్ డే సందర్భంగా ఆయన  ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర  యూనిట్‌.  స్టయిలిష్ లుక్‌లో కనిపిస్తున్న రాజశేఖర్ మరి ఈ సినిమాతో ఎలాంటి హిట్ ను కొడతాడో చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY