యూత్ ఐకాన్ చరణ్..!

Posted November 16, 2016 (4 weeks ago)

Ram Charan Bags Youth Icon Award 2016మెగా పవర్ స్టార్ రాం చరణ్ యూత్ ఐకాన్ అవార్డ్ కైవసం చేసుకున్నారు. ఏషియా విజన్ అవార్డ్స్ 2016 లో భాగంగా టాలీవుడ్ నుండి యూత్ ఐకాన్ అవార్డ్ రాం చరణ్ అందుకుంటున్నాడు. ఇక బెస్ట్ యాక్ట్రెస్ గా తమన్నా అవార్డ్ అందుకోనుంది. యూ.ఏ.ఈలోని షార్జా క్రికెట్ స్టేడియంలో నవంబర్ 18న ఈ అవార్డ్ ఫంక్షన్ జరుగనుంది.

మెగా హీరోలెంతమంది ఉన్నా మెగా పవర్ స్టార్ స్టైల్ వేరని ప్రత్యేకంగా చెప్పల్సిందే. మెగాస్టార్ లోని టాలెంట్ యాజిటీజ్ దించేస్తున్న చరణ్ ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్నా కూడా ఆయన ఫాలోయింగ్ కు ఏమాత్రం డోఖా లేదు. దీనికి నిదర్శనం సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరం దాటింది అది కూడా ఫ్లాపే అయినా సరే చరణ్ క్రేజ్ దృష్టి లో ఉంచుకుని అతనికి యూత్ ఐకాన్ అవార్డ్ అందిచడమే. ఇక ప్రస్తుతం చరణ్ ధ్రువ సినిమాతో రాబోతున్నాడు. తమిళ సూపర్ హిట్ సినిమా తని ఒరువన్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాతో చెర్రి సూపర్ హిట్ కొట్టడం ఖాయమంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు.

NO COMMENTS

LEAVE A REPLY