ధ్రువ 8 సీక్రెట్ అసలు సినిమా..!

Posted December 7, 2016

Ram Charan Dhruva 8 Secret Revealedతమిళ సూపర్ హిట్ మూవీ తని ఒరువన్ రీమేక్ గా మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన ధ్రువ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ క్రమంలో ధ్రువకు సంబందించిన డీటేల్స్ ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. చరణ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్న ధ్రువ మూవీ టైటిల్ లో 8 నెంబర్ స్పెసిఫిక్ గా కనిపిస్తుంది. అసలు ఆ నెంబర్ సీక్రెట్ ఏంటి అని అందరు ఆరా తీశారు.

చిత్రయూనిట్ ఇప్పటిదాకా ఆ సీక్రెట్ బయట పెట్టలేదు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం విలన్ ను టార్గెట్ చేసి హీరో 8 ఫార్ములాలను ప్రిపేర్ చేస్తాడట. అందుకే ఆ 8 ని హైలెట్ చేస్తూ టైటిల్ లో ఉంచారు. అసలైతే చరణ్ తీస్తున్న 8వ సినిమా కాబట్టి టైటిల్ లో ధ్రువతో పాటుగా 8 ఉంచారని అంటారు. కాని చరణ్ కు ధ్రువ 9వ సినిమా. సినిమా కోసం ఎంతో రిస్క్ తీసుకుని మరి కష్టపడ్డ చరణ్ సినిమాకు అంత కష్టపడకపోతే వేస్ట్ అనేస్తున్నాడు.

సో సినిమా మీద అన్ని కోణాల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ధ్రువ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా హిప్ హాప్ తమిజ మ్యూజిక్ అందించారు.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY