ధ్రువ సినిమా ఆన్ లైన్ లీక్..!

Posted December 12, 2016

Ram Charan Dhruva Movie Leaked Onlineమెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన ధ్రువ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తమిళ సూపర్ హిట్ సినిమా తని ఒరువన్ రీమేక్ గా వచ్చిన ధ్రువ సినిమా రిలీజ్ అయిన తెల్లారే మొత్తం సినిమా యూట్యూబ్ లో దర్శనమిచ్చింది. వెంటనే ఈ విషయం తెలుసుకున్న చిత్రయూనిట్ ఆ లింక్ ను డిలీట్ చేశారు. థియేటర్ ప్రింట్ తో వచ్చిన ధ్రువ టోటల్ సినిమా ఆన్ లైన్లో దర్శనమిచ్చే సరికి ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు.

సురేందర్ రెడ్డి డైరక్షన్లో వచ్చిన ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ కు ముందే సినిమాను ఆన్ లైన్లో లీక్ అయిన సందర్భాలు చాలానే చూశాం మితిమీరుతున్న పైరసీ దారుల నుండి పరిశ్రమను ఎలా కాపాడుకోవాలో అని దర్శన నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY