వెనక్కి తగ్గిన చరణ్..!

Posted November 19, 2016

Ram Charan Postponed Dhruva Releaseమెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ధ్రువ సినిమాపై కన్ ఫ్యూజన్ వీడింది. అసలైతే డిసెంబర్ 2న సినిమా రిలీజ్ చేద్దామనుకున్న చిత్రయూనిట్ డెశిషన్ మార్చుకుని ఆ తర్వాత వారం అంటే డిసెంబర్ 9న సినిమాను రిలీఎజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇంకాస్త స్పీడ్ అందుకోనుంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందిస్తున్నారు. తమిళ సూపర్ హిట్ మూవీ తని ఒరువన్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన టీజర్ అంచనాలను పెంచేసింది. అయితే డిసెంబర్ 2న రావాల్సిన ధ్రువ 9 కి పోస్ట్ పోన్ అవడానికి నోట్ల రద్దు కారణమని తెలుస్తుంది. ఇదనే కాదు 500, 1000 నోట్ల రద్దు వల్ల చాలా సినిమాల ఫైనాన్షియల్ డీలింగ్స్ ఆగిపోయాయి.

బ్రూస్ లీ ఫ్లాప్ తర్వాత చరణ్ చేస్తున్న ఈ ధ్రువ తన ఖాతాలో మరో సూపర్ హిట్ సినిమా పడేలా చేసి హిట్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి. ఈ సంవత్సరం చివరలో రాబోతున్న పెద్ద సినిమా ధ్రువనే కాబట్టి ఆ సినిమా బిజినెస్ మీద 2016కు శుభం కార్డ్ పడనుంది.

NO COMMENTS

LEAVE A REPLY