ఆ దర్శకుడి మీద నమ్మకం ఉంది:  చెర్రీ

Posted February 2, 2017

ram charan said i believe surender reddy directionమెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం 150’ సినిమాతో బాహుబలిని మినహాయించి ఇండస్ట్రీలోని రికార్డులన్నీ  బద్దలుకొట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో  మెగా అభిమానులంతా చిరు నెక్ట్స్ సినిమా ఏంటి అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే చిరు 151వ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న చెర్రీ… చిరు  సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తాడని అనౌన్స్ చేశాడు. ఇది విన్న చాలా మంది అభిమానులు కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ చెర్రీ మాత్రం సురేందర్ రెడ్డికి సినిమా అప్పగించడంతో చాలా క్లారిటీగా ఉన్నానని మీడియాకు వెల్లడించాడు.

సురేందర్.. చిరుని అభిమానులకు కావాల్సిన విధంగా చాలా స్టైలిస్ట్ గా ప్రొజెక్ట్ చేస్తాడని, చిరు  కూడా అదే ఫీలై తన సినిమా బాధ్యతని సురేందర్ రెడ్డిపై ఉంచారని తెలిపాడు. ఆ సినిమా ధృవ కంటే హిట్ అవుతుందని చెప్పుకొచ్చాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి  స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామన్నాడు.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY