చరణ్‌ నోట జనసేన మాట.. మెగా ఫ్యాన్స్‌ హ్యాపీ

Posted April 25, 2017 (5 weeks ago) at 18:58

ram charan says i will do janasena party campaigning
మెగా ఫ్యామిలీ హీరోలు అంతా కలిసి కట్టుగా లేరని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. అప్పుడప్పుడు కలిసినా కూడా వారు ఎప్పుడు కూడా కలిసి ఉండలేరు అంటూ యాంటీ మెగా ఫ్యాన్స్‌ విమర్శలు చేస్తూ ఉన్నారు. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌కు ఎప్పుడు కూడా కుదరని పని అని, ఇద్దరు రెండు దృవాలు అంటూ కొందరు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా రామ్‌ చరణ్‌ చేసిన ప్రకటన మెగా ఫ్యాన్స్‌కు సంతోషాన్ని కలిగిస్తుంది.

గోదావరి జిల్లాలో సుకుమార్‌ మూవీ మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న సందర్బంగా రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌తో మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ అంతా ఒక్క తాటిపై ఉంటుందని, బాబాయి జనసేన పార్టీకి మెగా ఫ్యామిలీ అంతా కూడా మద్దతుగా నిలుస్తుందంటూ చెప్పుకొచ్చాడు. మెగా ఫ్యాన్స్‌ అంతా కూడా ‘జనసేన’ వెంట ఉండాని, బాబాయికి రాజకీయాల్లో కూడా మద్దతుగా నిలవాలంటూ చరణ్‌ పిలుపునిచ్చాడు.

బాబాయి కోరితే తప్పకుండా జనసేన పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్లుగా చరణ్‌ చేసిన ప్రకటన మెగా ఫ్యాన్స్‌ ఆనందానికి అవదులు లేకుండా చేస్తుంది. 2019 ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ అన్ని స్థానాల నుండి పోటీ చేయనున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్‌ మరియు మెగా హీరోల మద్దతు చాలా ఉపయోగపడుతుందని రాజకీయ వర్గాల వారు అంటున్నారు.

Post Your Coment
Loading...