చెర్రీ సినిమా టైటిల్ ఇదేనా?

Posted February 13, 2017

ramcharan new movie titleధృవ సినిమా సక్సెస్ తో  మంచి జోష్ మీద ఉన్న రామ్ చరణ్ తేజ్ రీసెంట్ గా కొత్త మూవీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. పల్లెటూరి నేపధ్యంలో  సాగనున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా ప్రారంభం రోజునే  విడుదలైన చెర్రీ ఫస్ట్ లుక్ కూడా అందరిలో  ఆసక్తిని పెంచింది.

కాగా  ఈ సినిమాకు టైటిల్ ఇదేనంటూ టాలీవుడ్ లో కొన్ని టైటిల్స్ చక్కర్లు కొడుతున్నాయి. పల్లెటూరి ప్రేమలు, పల్లెటూరి మొనగాడు అనే టైటిల్స్ గురించి చిత్రయూనిట్ చర్చిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా తాజాగా మరో టైటిల్ తెరమీదకొచ్చింది. మెగాస్టార్ స్వగ్రామం మొగల్తూరు కాబట్టి ఆ పేరు కూడా కలిసి వచ్చేటట్లు సినిమాకు మొగల్తూరు మొనగాడు  అనే టైటిల్ ని ఫిక్స్ చేసే ఆలోచనలో  ఉన్నారట దర్శకనిర్మాతలు. చివరికి ఏ టైటిల్ సెట్ అవుతుందో చూడాలి.

Post Your Coment
Loading...