జయ(అ)మ్మగా రమ్యకృష్ణ..?

Ramyakrishna In Jayalalita Biopic

తమిళనాడు మాజి ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ గా ఓ సినిమా తీయాలని తమిళ సిని పరిశ్రమలో చర్చలు మొదలయ్యాయి. అయితే అమ్మ బ్రతికి ఉన్నప్పుడే ఈ ఆలోచన చేసినా అది కార్యరూపం దాల్చలేదు. అమ్మ మరణంతో షాక్ తిన్న సిని పరిశ్రమ ఇప్పుడు ఆమె జీవిత గాథను తెర మీదకు తీసుకురాబోతున్నారట. ఇక ఈ సినిమాలో లీడ్ రోల్ ఎవరు చేస్తే బాగుంటుంది అన్న దాని మీద ఓ అని వెతకడం మొదలుపెట్టారు. అయితే ఈ ఇంట్రెస్టింగ్ విషయాలన్ని ఫుల్లీ ఫిల్మీ అంటూ ఓ వెబ్ పేజ్ తో ఎవరి బయోపిక్ కు ఎవరు సరితూగుతారు అంటూ ఫోటో షాపీ చేసి మరి సోషల్ మీడియాలో వదులుతున్నారు.

ఇక ఆ క్రమంలో మలాలా పాత్రలో చేయాల్సి వస్తే సమంతను సెలెక్ట్ చేసిన ఫుల్లి ఫిల్మీ వారు.. అమ్మగా రమ్యకృష్ణ అయితే పర్ఫెక్ట్ అని అభిప్రాయపడుతున్నారు. అంతేనా అమ్మగా రమ్యకృష్ణ ఎలా ఉంటుందొ ఫోటో షాపీ చేసి మరి ఆ పిక్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అలనాటి అందాల తారగా మొన్న నిన్నటి తరం ప్రేక్షకుల నుండి ఈ నాటి ప్రేక్షకులకు శివగామిగా అదరగొడుతున్న రమ్యకృష్ణ జయలలితగా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. జయలలిత బయోపిక్ లో త్రిష నటిస్తున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి తమిళ తంబీలు రమ్యకృష్ణ, త్రిషలలో ఎవరిని అమ్మగా ఓటేస్తారో చూడాలి.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY