రానా ..ప్రభాస్ మాత్రం మిగిలారు ..

 rana prabhas war bahubali2 movie‘బాహుబలి 2’ సినిమా చిత్రీకరణ కొంత కాలంగా హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమాకి అత్యంత కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. తొలి భాగంలో యుద్ధ సన్నివేశాలు వన్స్ కట్టిపడేశాయి. దీంతో, అంతకు మించి గ్రాండ్‌గా ఉండేలా రెండవ భాగంలోని యాక్షన్ సీన్స్ ప్లాన్ చేశారు.

ప్రధాన పాత్రధారులు పాల్గొనగా, కొన్ని రోజులుగా ఏకధాటిగా యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యుద్ధంలో ప్రభాస్ .. రానా ముఖాముఖి తలపడే సన్నివేశాలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ ఇద్దరి పోరును తెరకెక్కించనున్నారట. ప్రభాస్-రానాల మధ్య కొనసాగే భీకర యుద్ధం, ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

Post Your Coment
Loading...