రానాతో శ్రీయా ఎఫైర్..!

Posted [relativedate]

rana shriya affair hot news for tollywoodఛాన్స్ దొరికితే ఏ హీరో ఏ హీరోయిన్ తో లంకెపెడదామా అని ఎదురుచూస్తుంటారు మీడియా వాళ్లు. ప్రస్తుతం హాట్ టాపిక్ గా చెక్కర్లు కొడుతున్న న్యూస్ ఏంటంటే రానా, శ్రీయా శరణ్ ల సీక్రెట్ ఎఫైర్. ఇద్దరు ముంబై లో సీక్రెట్ మీట్ తో మొదలైన ఈ న్యూస్ వారి మధ్య సంథింగ్ సంథింగ్ అనే రేంజ్లో వస్తున్నాయి. అయితే ఈ న్యూస్ గురించి త్వరగానే స్పందించింది శ్రీయా. ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు అటెండ్ అయిన సందర్భంలో రానాతో సరదాగా మాట్లాడా అంతే తప్ప రానాతో తనకు ఎలాంటి రిలేషన్ లేదని తేల్చి చెప్పేసింది శ్రీయా.

ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఇద్దరు కలిసాం తప్ప తనకు రానాతో ఎలాంటి పర్సనల్ రిలేషన్ లేదు అని ఖరాకండిగా చెప్పేసింది. మొన్నామధ్య బ్రావో తో కూడా శ్రీయా గురించి ఇలాంటి న్యూస్ హల్ చల్ చేసింది. మరి పెళ్లి వయసు దాటుతున్న ఈ సమయంలో అమ్మడు ఎవరితో కనబడితే వారితో ముడిపెట్టడం కాస్త ఇబ్బందిగా ఉన్నా ఆమె మాత్రం తన లైఫ్ తన ఇష్టం అన్నట్టుగా మాట్లాడేస్తుంది.

ఇక భళ్లాలదేవ విషయానికొస్తే హీరోయిన్స్ తో చనువుగా ఉండటం మాములే. అప్పట్లో త్రిషతో కూడా రానా సీరియస్ రిలేషన్ లో ఉన్నాడని హడావిడి చేశారు తీరా చూస్తే మళ్లీ అంతా తుస్ అనిపించేశారు.