డ్రైవర్ తో దారి తప్పిన రష్మి..!

Posted December 19, 2016

Rashmi Wrong Step With Her Driver

బుల్లితెర మీద యాంకరింగ్ తో సూపర్ క్రేజ్ సంపాదించిన రష్మి ఓ పక్క సినిమాల్లో కూడా రెచ్చగొట్టే అందాలతో రచ్చ చేస్తుంది. గుంటూర్ టాకీస్ సినిమాతో యూత్ ను టార్గెట్ చేసిన రష్మి దారి తప్పి ఒక చోట వెళ్లాల్సి మరో చోటికి వెళ్లిందట. ఇంతకీ విషయం ఏంటి అంటే కర్నూలు నంధ్యాలలో ఓ స్పెషల్ ఈవెంట్ లో పాటిస్పేట్ చేయాల్సిన రష్మి తన కార్ డ్రైవర్ తప్పిదం వల్ల కరీంనగర్ వెళ్లిందట. ఇక మళ్లీ రూట్ మార్చుకుని ఎలాగోలా కర్నూల్ చేరుకున్నారట. లేట్ అయినందుకు కారణం ఇది అని తనకు తానుగా చెప్పింది రష్మి. సో డ్రైవర్ తో దారి తప్పిన రష్మి ఆ తర్వాత ఎలాగోలా అక్కడికి చేరుకుని ప్రోగ్రాం సక్సెస్ అయ్యేలా చేసిందట.

జబర్దస్త్ షోతో మంచి పాపులారిటీ సంపాదించిన రష్మి సినిమాల్లో కూడా వరుస అవకాశాలను అందుకుంటుంది. ఛాన్స్ దొరికితే స్టార్స్ సినిమాలో ఐటం సాంగ్ అయినా చేస్తా అంటున్న రష్మి అందుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈమధ్య వరుస సినిమాలటో బిజీగా మారిన రష్మి అవి పూర్తి చేసుకుని ప్రస్తుతం ఖాళీగా ఉంది. మరి ఏ స్టార్ హీరో రష్మిని ఎంకరేజ్ చేస్తాడో చూడాలి. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు హీరోల సినిమాల్లో ఐటం సాంగ్ కోసం ఆమెతో సంప్రదింపులు చేశారట. అవి ఏంటి అన్నది త్వరలో తెలుస్తుంది.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY