“అదిగో” హీరో తో క్యూ లో డైరెక్టర్ రవి బాబు ..

Posted [relativedate]

ravi babu in queue with adigo heroపంది పిల్ల లీడ్ రోల్లో ‘అదిగో’ సినిమాను తెరకెక్కిస్తున్న రవిబాబు, ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు బ్యాంకులు, ఏటీయంల ముందు క్యూ కడుతున్నారు. అందుకే తన సినిమా ప్రమోషన్కు అదే కరెక్ట్ ప్లేస్ అని భావించిన రవిబాబు, తన సినిమా హీరో పందిపిల్లతో కలిసి ఏటీయం క్యూ లైన్లో నిలుచున్నాడు. రవిబాబు లాంటి స్టార్ క్యూ లైన్లో కనిపించడమే షాక్ అనుకుంటే, చంకలో పందిపిల్లతో కనిపించటంతో …ఓ డిఫరెంట్ ఐడియా తో ఎటిఎం కు రావడం పబ్లిసిటీ చేసుకోవడం భలే క్రియేటివ్ అంటున్నారు జనం .