రవితేజ ..ఒకేసారి ఇద్దరితో

 raviteja act 2 movies at a timeగతేడాది డిసెంబర్ లో వచ్చిన బెంగాల్ టైగర్ తర్వాత.. కొత్త సినిమా ఏదీ స్టార్ట్ చేయలేదు మాస్ మహరాజ్ రవితేజ. ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల చేసే ఈ మాస్ హీరో.. 9 నెలల పాటు ఖాళీగా ఉండడమంటే ఆశ్చర్యంగానే ఉంది. రవితేజ హీరో అయ్యాక ఇంత గ్యాప్ ఎప్పుడూ తీసుకోలేదని అంటున్నారు. కొత్త ప్రాజెక్టులను పట్టాలెక్కించే పనిలోనే బిజీగా ఉన్న ఈ హీరో.. తనకు ‘పవర్’ నిచ్చిన బాబీకి.. మరోసారి ఛాన్స్ ఇస్తున్నాడు.

‘పవర్’ అటు దర్శకుడికి పేరు తేవడమే కాకుండా.. ఇటు మంచి వసూళ్లు కూడా సాధించింది. ఈ కొత్త మూవీ దక్షిణ కొరియా చిత్రం స్ఫూర్తితో రూపొందుతోందని అంటున్నారు. ఆ సినిమా కథను అడాప్ట్ చేసుకుని.. తెలుగుకు వీలుగా స్క్రిప్ట్ మార్చి.. రవితేజతో చేయనున్నాడట బాబీ. ఇప్పటికే స్క్రిప్ట్ కి సంబంధించిన పనులు.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకున్నాయని సమాచారం.

ఇది కాకుండా విక్రమ్-దీపక్ అనే జంట దర్శకులతో కూడా రవితేజ ఓ చిత్రం చేయనున్నాడు. ఇందులో స్టైలిష్ పోలీస్ గా కనిపిస్తాడట. అన్నిటికంటే పెద్ద హైలైట్ ఏంటంటే.. ఈ రెండు సినిమాలు ఒకేసారి మొదలుపెట్టేస్తారట. ఈ చిత్రాలను రెండు నెలల గ్యాప్ లో రిలీజ్ చేయాలన్నది రవితేజ ఆలోచనగా తెలుస్తోంది.

NO COMMENTS

LEAVE A REPLY