ఫ్యామిలీ సెల్పీని పోస్ట్ చేసిన రవితేజ..!!

Posted February 1, 2017

raviteja family selfieదాదాపు సంవత్సర కాలంగా ఒక్క సినిమాను కూడా మొదలుపెట్టని రవితేజ రెండు రోజుల క్రితం రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు అంటూ రెండు సినిమాలను ప్రారంభించి అభిమానులకు డబుల్ కిక్ ఇచ్చాడు.

ఇక ఈ మాస్ మహరాజా రవితేజకు భార్య, పిల్లలు ఉన్నట్లు చాలా మందికి  తెలియదు. రవితేజ కూడా ఇప్పటివరకు ఏ సినీ ఫంక్షన్ కి తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేయలేదు. అయితే స్టార్ హీరోలందరూ తమ తమ ఫ్యామిలీల గురించి చెబుతుండం చూసి రవితేజ కూడా రూట్ మార్చాడో ఏమో తెలియదు కానీ తాజాగా తన ఫ్యామిలీ ఫోటో ఒకటి ఫేస్ బుక్ లో షేర్ చేసి  రచ్చ లేపుతున్నాడు.  ఆ సెల్ఫీలో ఉంది రవితేజ భార్య కళ్యాణి, కొడుకు మహాదన్, కూతురు మోక్షద.  ఎప్పుడూ ఫ్యామిలీని పెద్దగా ఎవ్వరికీ ఇంట్రొడ్యూస్ చేయని రవితేజ.. ఈ ఒక్క ఫోటోతో తన ఫ్యాన్స్ కు టాప్ లేచిపోయే కిక్కిచ్చాడనే  చెప్పాలి. నిజంగా రవితేజకు ఇంత పెద్ద పిల్లలు ఉన్నారంటే ఆశ్యర్యమే మరి.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY