నోట్ల రద్దు పై సభలో ప్రతిపక్షాల రియాక్షన్..

Posted [relativedate]

reaction of opposition party leaders on currency banఎట్ట కేలకు నోట్ల రద్దు అంశం పై చర్చ రాజ్య సభ లో రారంభం ఇది మోడీ ఏక పక్షం గా నిర్ణయం తీసుకున్నారంట విపక్షాలు భగ్గుమన్నాయి , ఎవరేమన్నారో చూద్దాం …

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మొదట నోట్ల రద్దు పై మాట్లాడుతూ నల్లధనాన్ని అరికట్టేందుకే పెద్దనోట్లను రద్దు చేశారని ప్రధాని మోదీ అంటున్నారని, కానీ ఆయన అభిప్రాయంతో తాను ఏకీభవించడం లేదని తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నోట్ల రద్దు ప్రవేశపెట్టిన విధానం సరిగ్గా లేదని కేంద్రాన్ని తప్పుబట్టారు. నోట్ల రద్దుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు సహకారం అందించే కోఆపరేటివ్‌ బ్యాంకులు కుదేలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.

==నోట్ల రద్దుతో కరెన్సీ, బ్యాంకుల వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయారు.
==ప్రధాని 50 రోజులు ఆగమంటున్నారు. కానీ పేదలకు ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది.
==నోట్ల రద్దు వెనుక ఉద్దేశాలను నేను వ్యతిరేకించడం లేదు.
==ఈ విషయంలో ప్రజల కష్టాలు దూరం చేసేందుకు కొన్ని నిర్మాణాత్మకమైన ప్రతిపాదనలతో ప్రధాని ముందు రావాలి.
==బ్యాంకులో డబ్బులు డిపాజిట్‌ చేస్తే తిరిగి ఇవ్వలేని దేశం ఏదైనా ఉందా?
==నోట్ల రద్దు వ్యవస్థీకృతమైన దోపిడీ జరుగుతోంది. చట్టపరంగా చేసిన భారీ తప్పిదం ఇది.
==నోట్ల రద్దు కారణంగా జీడీపీ రెండుశాతం తగ్గింది. ఈ విషయంలో ఆర్బీఐని తప్పుబట్టడంలో సరైనదే.

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఓ బ్రియాన్ రాజ్యసభలో ప్రధానినుద్దేశించి మాట్లాడుతూ మీ నిర్ణయం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చచ్చుబడుతుంది.. అందుకే నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నాం’’ అని నోట్ల రద్దుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ… ఈ నిర్ణయం దేశంలోని అట్టడుగు స్థాయి నుంచి ప్రతి ఒక్కరినీ గాయపర్చిందని పేర్కొన్నారు. ప్రత్యేకించి పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.

సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు నరేష్‌ అగర్వాల్‌ రాజ్యసభలో మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు చేయడం వల్ల దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించినట్లు ఉందని అన్నారు. నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద సామాన్యులు గంటల తరబడి నిల్చుంటున్నారని.. కొద్దిశాతం మంది నల్లకుబేరుల కోసం సామాన్యులను ఇబ్బందులకు గురిచేయడం చేయడం సరికాదన్నారు. దేశంలో అసలు నల్లధనం ఎంతుందో కేంద్రం వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.