ఖమ్మం మిర్చి కొలిమికి కారణమేంటి..?

 Posted April 30, 2017 (5 weeks ago) at 12:56

reason for khammam mirchi furnaceఓవైపు తెలంగాణ సర్కారు రైతులపై వరాల వర్షం కురిపిస్తుంటే.. మరోవైపు పంటలకు గిట్టుబాట ధర లేక మార్కెట్ యార్డుల్లో జరుగుతున్న విధ్వంస కాండ.. కేసీఆర్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా.. ఎక్కడో లోపం జరుగుతోందని గుర్తించారు కేసీఆర్. మిర్చి రైతుల ఆందోళనతో మంత్రి హరీష్ రావు కూడా టార్గెట్ అయ్యారు. ఎప్పుడూ సమర్థంగా వ్యవహరించే హరీష్.. ఈసారి చేయి దాటిపోయే వరకు స్పందించలేదనే విమర్శలు ఎధుర్కున్నారు.

సరిగ్గా ప్లీనరీ, వరంగల్ సభ ఏర్పాట్లలో టీఆర్ఎస్ తలమునకలైన సమయంలోనే ఖమ్మం మార్కెట్ యార్డులో మిర్చి రైతుల ఆందోళన జరిగింది. పైగా తమకు ఏ నేత వచ్చి భరోసా ఇవ్వకపోవడం, వారి పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండటం అన్నదాతలకు కోపం తెప్పించింది. అందుకే వారు రెచ్చిపోయారనేది అసలు నిజం. కానీ గులాబీ పార్టీ యథావిధిగా జరిగిన ఘటనను విపక్షాలపై నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది.

వచ్చే ఖరీఫ్ నుంచి ఎకరానికి నాలుగువేల చొప్పున రెండు పంటలకు ఎరువులకు డబ్బులిస్తానంటున్న కేసీఆర్.. గిట్టుబాటు ధర విషయంలో ఎందుకు స్పందించరన్న ప్రశ్న.. టీఆర్ఎస్ కు ఎక్కడ తగలాలో అక్కడ తగులుతోంది. దీంతో సీఎం ఈ అంశంపై నోరు విప్పకుండా జాగ్రత్తపడుతున్నారు. కానీ మిర్చి మంట గులాబీకి బాగానే తగిలిందని తెలుస్తోంది. ఎన్నికల్లో మిర్చి రైతుల అంశం ప్రభావం చూపే అవకాశం ఉందని గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

Post Your Coment
Loading...